చిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గ్రామానికి చెందిన 11 ఏళ్ల కిరణ్ అనే బాలుడు వేసవి సెలవులకు ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి ఆరుబయట నిద్రిస్తున్న సమయంలో విష సర్పం కాటు వేయడంతో అపస్మారక స్థితికి చేరుకున్నాడు. కుటుంబ సభ్యులు అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.