మే 14, 15, 16 తేదీల్లో జరిగిన పలమనేరు తిరుపతి గంగమ్మ జాతర ఆదాయ, ఖర్చుల వివరాలను ఆలయ కమిటీ ఛైర్మన్ శ్రీధర్, ఏఈవో సోమవారం వెల్లడించారు. షాప్ రూముల బాడుగలు, హుండీ, అంగళ్ల ఆదాయం, చీరల వేలం, విరాళాల ద్వారా మొత్తం రూ. 28,14,606 ఆదాయం రాగా, జాతర నిర్వహణకు రూ. 28,14,319 ఖర్చయినట్లు తెలిపారు.