1/4/26 బుధవారం చిత్తూరు జిల్లా పలమనేరు మండలం జగమర్ల అటవీ ప్రాంతంలో చంద్రమ్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. సోమవారం ఆమె మిస్సింగ్ కేసు నమోదు కాగా, టైలరింగ్ వ్యాపారం చేస్తూ చీటీలు నడుపుతున్న చంద్రమ్మను అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం అనే యువకుడు బైక్‌పై తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. అతని విచారణలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సుబ్రహ్మణ్యంతో పాటు మరో ఇద్దరు యువకుల ప్రమేయం ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.