వీకోటలో ఆలయ వార్షికోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

పలమనేరు నియోజకవర్గం, వి కోటలో వెలసిన దుర్గ మాత ఆలయంలో 16వ వార్షికోత్సవ వేడుకలను ఈనెల 29న నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం ఏడు గంటలకు గోపూజ అనంతరం గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమై మహా మంగళహారతి తో ముగుస్తాయని తెలిపారు. ఆలయంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్