చిత్తూరు, పలమనేరు ప్రాంతాలకు చెందిన ఎంపీడీవోలు శనివారం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక పాలన, గ్రామ పంచాయతీల నిర్వహణ, పారిశుద్ధ్య కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, స్వయం సహాయక బృందాల పథకాలు, హాస్టళ్ల నిర్వహణ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, అంగన్వాడీ కేంద్రాల పనితీరు వంటి అంశాలపై వారు అవగాహన చేసుకున్నారు.