అప్పు ఇచ్చిన వారి వేధింపులు.. మధ్యవర్తిగా ఉన్న మహిళ ఆత్మహత్య

తెలిసిన వారికి అప్పు ఇప్పించిన మధ్యవర్తి షావర్ (50) సొమ్ము తిరిగి రాకపోవడంతో అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. పలమనేరు పోలీసులైన్ ఏరియాలో నివాసముంటున్న ఆమె, అప్పు తీసుకున్నవారు చెల్లించకపోవడంతో అప్పు ఇచ్చిన వారి వేధింపులకు గురయ్యారు. ఇటీవల ఇంటి నుంచి వెళ్లిపోయినా కుటుంబ సభ్యులు వెతికి తీసుకొచ్చారు. అయితే, అప్పుల వారి ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల కిందట మళ్లీ వెళ్లిపోయారు. గురువారం పట్టణంలోని పెద్దచెరువులో ఆమె మృతదేహం లభ్యం కాగా కుటుంబ సభ్యులు షావర్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్