పలమనేరు పట్టణ పరిధిలోని గంట ఊరు వైయస్సార్ నగర్ లో కనుమ గంగమ్మ జాతర పోస్టర్లను మంగళవారం స్థానికులు, గంగమ్మ గుడి చైర్మన్ డాక్టర్ మురుగన్ తో కలిసి ఆవిష్కరించారు. ఏప్రిల్ 4న జాతర ప్రారంభం కానుంది. అనంతరం ఏప్రిల్ 13న అమ్మవారి శిరస్సు మేరవని, 14న అమ్మవారి విశ్వరూప దర్శనం, 15న అమ్మవారి జల్దీ కార్యక్రమం జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి కృప పొందాలని నిర్వాహకులు కోరారు.