చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి గురువారం రాత్రి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. బైరెడ్డిపల్లి మండలంలో శుక్రవారం జరగనున్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలనను వివరించే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఆయనకు ఎమ్మెల్యే స్వాగతం పలికారు.