పలమనేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి ఆదివారం పూతలపట్టులో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పూతలపట్టు ఎమ్మెల్యేతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం విజయం విద్యా సంస్థల అధినేత మాతృమూర్తి అచ్చమ్మకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఆలయ చైర్మన్ మణి నాయుడు, టీడీపీ నాయకులు దొరబాబు, చంద్రమౌళి, చిరంజీవి, చంద్రశేఖర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.