పలమనేరు: చెట్టు కింద దాదాపు గంటసేపు నిలబడ్డ ఒంటరి ఏనుగు

పలమనేరు అటవీ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఒక ఏనుగు కనిపించడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. మొదట్లో పొలాల వైపు వస్తుందేమోనని రైతులు ఆందోళన చెందారు. అయితే, దాదాపు గంటసేపు ఒకే చోట ఉండడంతో, ఎండ వేడిమిని తట్టుకోలేక చెట్టు నీడలో సేద తీరుతుందని తరువాత అర్థమైంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉండటంతో మూగజీవులు కూడా ఇబ్బంది పడుతున్నాయి.

సంబంధిత పోస్ట్