పలమనేరు: అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలి

బైరెడ్డిపల్లె మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ నాలుగు రోడ్ల కూడలిలో అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని బుధవారం ధర్నా నిర్వహించారు. తమకు కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వెట్టిచాకిరి నుంచి తప్పించాలని కోరారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవాలని నినాదాలు చేశారు. అంగన్వాడి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్