పలమనేరు కాంగ్రెస్ కోఆర్డినేటర్ శివశంకర్ రాజీనామా

పలమనేరు కాంగ్రెస్ పార్టీకి వెన్నెముకగా నిలుస్తున్న శివశంకర్, పార్టీ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు. పలమనేరు నియోజకవర్గంలో మరో వర్గం ఏర్పడటంతో తనకు ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే, తాను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిలమ్మతోనే ఉంటానని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. పదవిపై తనకు ఆశ లేదని ఆయన పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున పలమనేరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన శివశంకర్, ఈ రాజీనామాతో పార్టీలో చర్చనీయాంశంగా మారారు.

సంబంధిత పోస్ట్