చిత్తూరు జిల్లా, పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని దండపల్లి రోడ్డులో వీధి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. మంగళవారం స్థానికులు మాట్లాడుతూ, వీధి కుక్కల వల్ల వాహనదారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు భయంతో రోడ్లపై తిరగలేకపోతున్నారని తెలిపారు. రెండు రోజుల క్రితం ఒక వ్యక్తి కుక్కల దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యారని పేర్కొన్నారు. వీధి కుక్కలను పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాలని స్థానికులు మున్సిపాలిటీ అధికారులను కోరుతున్నారు.