పలమనేరు: బూడిదపల్లిలో ఏనుగు హల్ చల్

చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లిలో గురువారం ఏనుగు సంచారం కలకలం రేపింది. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో విద్యుత్ షాక్‌తో ఒక ఏనుగు మరణించిన నేపథ్యంలో, మళ్లీ ఏనుగు రావడంతో రైతులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, ఏనుగును అడవిలోకి తరలించే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్