పలమనేరు: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి..!

చిత్తూరు జిల్లా గంగవరం మండల పరిధిలోని వైయస్సార్ జంక్షన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని వెనుక వైపు నుంచి కారు ఢీకొనడంతో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. బెంగళూరు నుంచి తిరుపతి వైపునకు వెళ్తున్న కారులో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్