పలమనేరు: వారు చేసింది మహా పాపం

గత వైసిపి ప్రభుత్వ పాలనలో (2019-2024) తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడినట్లు సిట్ అధికారులు తేల్చారని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం పలమనేరులో ర్యాలీ నిర్వహించి, వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, శ్రీవారి భక్తులకు కల్తీ నెయ్యితో చేసిన లడ్డూలు పంపిణీ చేసి వారి మనోభావాలను దెబ్బతీసి పాపం మూటకట్టుకున్నారని పేర్కొన్నారు. గత పాలకులు చేసినది మహా పాపమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్