పలమనేరు: బావిలో పడి మహిళ మృతి

పెద్దపంజాణి మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు. చిన్నపాపమ్మ (45) బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు బావిలో దూకగా ఆమె అప్పటికే చనిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలమనేరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్