పలమనేరు: హత్యకు గురైన మహిళ

పలమనేరు నియోజకవర్గంలో అదృశ్యమైన చంద్రమ్మ అనే మహిళ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. పెద్దపంజాణి మండలం, ముద్దేపల్లికి చెందిన చంద్రమ్మ వడ్డీ వ్యాపారం చేసేది. రెండు రోజుల క్రితం కనిపించకుండా పోయిన ఆమె కోసం కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లినట్లు గుర్తించారు. విచారణలో, సుబ్రహ్మణ్యం హత్య చేసి జగమర్ల అడవిలో మృతదేహాన్ని పడేసినట్లు సమాచారం. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్