పెద్దపంజాణిలో మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించిన పోలీసులు

పలమనేరు నియోజకవర్గం, పెద్దపంజాణి మండలంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు పోలీసులు మహిళలకు మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధైర్య స్పర్శ కార్యక్రమం, ద్విచక్ర వాహనాల్లో హెల్మెట్ వాడకం, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, మత్తు పదార్థాల అనర్థాలు, అపరిచితులపై నిఘా వంటి అంశాలపై వివరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్