సోమవారం రాత్రి పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలం, ధర్మపురి గ్రామంలో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలపై నేరాలు, పోక్సో చట్టం, ఐపీఎల్ బెట్టింగ్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, బాల్య వివాహాల అనర్థాల గురించి వివరించారు. చట్టపరమైన నిబంధనలు, ఫిర్యాదు చేసే విధానాలు, కొత్తవారి పట్ల అప్రమత్తత గురించి గ్రామస్తులకు తెలిపారు.