పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాప్ కోరుతూ పీపీఎస్ నిరసన

పలమనేరులో పలమనేరు పరిరక్షణ సమితి (PPS) సభ్యులు తమ కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. పట్టణ సమస్యలపై చర్చించిన అనంతరం, ఎంపిటి రోడ్డులోని నెహ్రూ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాప్ ఏర్పాటు చేయాలని, పట్టణ అభివృద్ధికి నోచుకోవడం లేదని కార్డులు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో పీపీఎస్ అధ్యక్షులు నరసింహులు, కార్యదర్శి నారాయణతో పాటు పలువురు సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్