శ్రీవాణి, పద్మావతి కళాశాల విద్యార్థులకు రైజింగ్ స్టార్ అవార్డులు

పలమనేరు పట్టణంలోని శ్రీవాణి & పద్మావతి డిగ్రీ కళాశాల నుండి ఐదుగురు విద్యార్థులు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రకటించిన రైజింగ్ స్టార్ అవార్డులకు ఎంపికయ్యారు. బీఎస్సీ, బీసీఏ, బీకాం సిఏ, బీఎస్సీ హార్టికల్చర్ గ్రూపుల నుండి అత్యధిక మార్కులు సాధించిన హారతి, ఆఫ్రిన్, లక్ష్మి, మానస, అనూ శ్రీ, ఒక విద్యార్థి ఈ అవార్డులను అందుకున్నారు. బుధవారం ఎస్వీ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ నర్సింగ్ రావు, ఆంధ్రప్రదేశ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ విజయ్ భాస్కర రావు చేతుల మీదుగా విద్యార్థులు అవార్డులు అందుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, తోటి విద్యార్థులు వారిని అభినందించారు.

సంబంధిత పోస్ట్