ఆర్థిక ఇబ్బందులతో సంఘమిత్ర గ్రూప్ సభ్యురాలు ఆత్మహత్యాయత్నం

పలమనేరు నియోజకవర్గం కల్లాడు గ్రామానికి చెందిన సంఘమిత్ర గ్రూప్ సభ్యురాలు సరోజమ్మ, గ్రూపు సభ్యుల మధ్య తగువుల కారణంగా, అందరికీ సమానంగా డబ్బులు తీసి ఇవ్వలేక, తనకు డబ్బు అవసరమున్నందున ఆదుకోలేకపోయినందుకు మనస్థాపం చెంది గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నం జరిగినప్పుడు అక్కడున్న మీడియా ప్రతినిధులు ఆమెను సురక్షితంగా కాపాడారు. అనంతరం పోలీసులు అక్కడికి చేరుకొని వివరాలు సేకరించి, దర్యాప్తు ప్రారంభించి ఆమెకు ధైర్యం చెప్పారు. నిజానిజాలు దర్యాప్తులో తేలవలసి ఉంది.

సంబంధిత పోస్ట్