తిరుపతిలోని వి.ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్‌లో ఆదివారం వడ్డెర సేవా దళ్ ఆధ్వర్యంలో జరిగిన వడ్డెర ఉన్నత విద్యావంతుల ఆత్మీయ సమావేశంలో వడ్డెర యువనాయకుడు, బీసీ యువజన అధ్యక్షుడు డా. యం.డి.హెచ్. పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 40 లక్షల వడ్డెరల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభివృద్ధి, విద్య, ఉద్యోగ అవకాశాలు ఎస్టీ జాబితాలో చేర్చినప్పుడే సాధ్యమవుతాయని అన్నారు. కావున, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్డెరలంతా ఐక్యమత్యంతో కృషి చేయాలని సూచించారు.