తిరుపతి: ఘనంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవాలు

తిరుమలలో ఐదు రోజుల పాటు జరిగిన శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ మలయప్పస్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా తెప్పపై విహరించి భక్తులకు కనువిందు చేశారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను నాలుగు మాడ వీధుల్లో ఊరేగించి పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు. రాత్రి విద్యుద్దీపాలతో అలంకరించిన తెప్పపై శ్రీభూ సమేతంగా శ్రీమలయప్పస్వామివారు పుష్కరిణిలో ఏడు చుట్లు విహరించి భక్తులను అలరించారు.

సంబంధిత పోస్ట్