వి. కోట మండలం తోటకనుమ గ్రామంలోని చౌడేశ్వరి దేవస్థానంలో పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సొంత గ్రామ ప్రజలతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. పలమనేరు ప్రజలందరూ సుఖంగా ఉండాలని, 2029లో జగనన్న మళ్లీ అధికారంలోకి రావాలని, బడుగు బలహీన వర్గాల కలలు నెరవేరాలని చౌడేశ్వరి మాతను ప్రార్థించానని తెలిపారు.