వి కోట: సురేష్ మృతి పార్టీకి తీరని లోటు

పలమనేరు నియోజకవర్గం, వి. కోట మండలం, కృష్ణాపురం పంచాయతీ, దానమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన సురేష్ బుధవారం మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ సురేష్ పార్థివ దేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సురేష్ మృతి పార్టీకి తీరని లోటు అని ఎమ్మెల్యే అన్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి పార్టీ అడ్డగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా కల్పిస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్