వి కోట బాధిత కుటుంబానికి అండగా ఉంటాం

పలమనేరు నియోజకవర్గంలో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విలేఖరి జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం పలమనేరు ఎమ్మెల్యే సతీమణి రేణుక రెడ్డి పరామర్శించారు. ఈ ఘటన పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్యకు పాల్పడిన వారిని ఎంతటి వారైనా సరే కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, వారికి ధైర్యం చెప్పి భరోసా కల్పించారు.

సంబంధిత పోస్ట్