పలమనేరులో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

గురువారం పలమనేరు పట్టణ పరిధిలోని పెద్ద చెరువులో షావర్ (50) అనే మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. స్థానికులు చెరువులో మహిళ మృతదేహం తేలుతున్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మిస్సింగ్ కేసుగా నమోదైన షావర్ మృతదేహాన్ని గుర్తించారు. మహిళ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కానున్నాయి.

సంబంధిత పోస్ట్