పీలేరు: నిందితులపై చర్యలకు డిమాండ్

మదనపల్లె అంకిశెట్టివారిపల్లెలో ఏర్పాటు చేసిన బుద్ధుడి విగ్రహం ధ్వంసం ఘటనలో నిందితులపై చర్యలు తీసుకోవాలని పీలేరు ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు పీలేరులో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ ఘటనపై నిరసన తెలుపుతున్న దళిత నేతలపై పోలీసు అధికారులు దురుసుగా వ్యవహరించి, తప్పుడు కేసులు నమోదు చేయడం అన్యాయమన్నారు.

సంబంధిత పోస్ట్