పీలేరు పట్టణంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ప్రభుత్వ ఐటీఐ)లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 20వ తేదీ వరకు పెంచినట్లు కళాశాల ప్రిన్సిపాల్ బాలమురళీ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రెండవ విడత ప్రవేశం కోసం దరఖాస్తు గడువు పెంచినట్లు చెప్పారు. ఈ నెల 20న సాయంత్రం లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని 22 లోపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందన్నారు.