ఢిల్లీ భరత్ మండపంలో జరిగిన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ అవార్డు ప్రధానోత్సవంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏడు జాతీయ పురస్కారాలు లభించాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఛైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. బొబ్బిలి వీణ, ఏటికొప్పాక బొమ్మలు, పెద్దాపురం సిల్క్, చీరాల సిల్క్, వెంకటగిరి చీర, ధర్మవరం పట్టు, నరసాపురం అల్లికల కుట్టు కళలు పురస్కారాలు పొందాయిని హరిప్రసాద్ తెలిపారు.