పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై ప్రమాదం

పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారిపై రేణిగుంట మండలం ఆర్. మల్లవరం బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి వైపు వస్తున్న కారును వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి అవతలి రోడ్డుపై పడింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడు. అతడు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్