ఐరాల: పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం: ఎమ్మెల్యే

ఆదివారం ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన ‘పల్స్ పోలియో’ కార్యక్రమంలో పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరిగా వేపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని, భవిష్యత్తు తరాలను ఆరోగ్యంగా ఉంచడం, పోలియో రహిత సమాజాన్ని నిర్మించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్