శుక్రవారం రాత్రి బంగారుపాళ్యం మండలం బలిజపల్లి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ వాహనం బైక్‌ను ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.