బంగారుపాళ్యం: 11 కెవి వైర్లు తగిలి నెమలి మృతి

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, మాడుపోలేరు గ్రామంలో బుధవారం విద్యుత్ షాక్ తో ఒక నెమలి మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలాల్లో తిరుగుతున్న రెండు నెమళ్లలో ఒకటి పైకి ఎగరగా 11 కెవీ విద్యుత్ తీగలకు తగిలి మరణించింది. స్థానికులు సమాచారం అందించడంతో అటవీ శాఖ అధికారులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్