బంగారుపాళ్యం: ఏడుగురు అరెస్ట్

బంగారుపాళ్యం మండలం బి. ఎల్. కండ్రిగ సమీపంలో సోమవారం పేకాట స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదేశాల మేరకు డ్రోన్ నిఘా ద్వారా ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో పలని, నాగరాజు, ఢిల్లీ ప్రసాద్, ఎర్రయ్య, పట్టాభి, ఆనంద్ రాజశేఖర్ అనే ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 32,200 నగదు, 52 పేకాట కార్డులను స్వాధీనం చేసుకున్నారు. దాము, జీవ, భాగ్యరాజ్ అనే మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని సీఐ శ్రీనివాసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్