పూతలపట్టులో తెల్లవారుజామున యాక్సిడెంట్

శుక్రవారం తెల్లవారుజామున పూతలపట్టులోని తలుపులపల్లి బస్టాప్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక లారీ మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన డ్రైవర్‌ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల కథనం ప్రకారం, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.

సంబంధిత పోస్ట్