చిత్తూరు జిల్లా, పూతలపట్టు మండలంలోని కిచ్చన్నగారి పల్లె సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాకాల మండలం పచ్చిపాలపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ అభిషేక్, సొంత పనుల నిమిత్తం చిత్తూరుకు వెళ్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.