శుక్రవారం, పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలంలోని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ తన కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అధికారులు వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆస్థాన మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేష వస్త్రం, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ వాసు, చిత్తూరు కోర్టు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.