చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం వెలుతురుచేను పంచాయతీ పరిధిలోని బురగమానూరు గ్రామానికి చెందిన పవన్ కుమార్ (జేసీబీ డ్రైవర్) గురువారం నుండి కనిపించకుండా పోయాడు. ఈ విషయమై అతని తల్లిదండ్రులు బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్ కుమార్ ఎక్కడైనా కనిపించినట్లయితే 9618568464, 6305288499 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.