చిత్తూరు జిల్లాలో జరిగిన దారుణ హత్య కేసులో, అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నారనే కారణంతో తన ఇద్దరు కుమారులను ఉరివేసి చంపిన తల్లి పవిత్రకు చిత్తూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. రామకుప్పం మండలం కవ్వంపల్లికి చెందిన పవిత్ర, ట్రాక్టర్ డ్రైవర్ వేమన్నతో అక్రమ సంబంధం పెట్టుకుంది. 2017 సెప్టెంబరులో తన 6, 3 ఏళ్ల కుమారులను హత్య చేసింది. కేసు దర్యాప్తు అనంతరం, మంగళవారం కోర్టు ఈ తీర్పును వెలువరించింది.