అబార్షన్ కిట్లు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్: కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరిక

మెడికల్ ఏజెన్సీలు నిబంధనలకు విరుద్ధంగా అబార్షన్ కిట్లు, నార్కోటిక్ డ్రగ్స్ అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ హెచ్చరించారు. ఔషధ నియంత్రణ, సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపుల్లో మందులు విక్రయించాలని, నిబంధనలు అతిక్రమిస్తే లైసెన్సులు రద్దు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్