పూతలపట్టు: కారులో చెలరేగిన మంటలు

బంగారుపాళ్యం సమీపంలోని హైవే ఫ్లైఓవర్ వద్ద ఓ కారు బోల్తా కొట్టినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. బెంగళూరు వైపు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు అతి వేగంగా వస్తూ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా కొట్టింది. ఒక్కసారిగా కారులో మంటలు చెల్లరేగాయి. అందులో ఉన్నవారు బయటకు దిగడంతో పలువురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్