పూతలపట్టు డా. బి. ఆర్. అంబేడ్కర్ గురుకులంలో టెన్త్ ఫలితాల్లో వరుసగా మూడోసారి 100 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపల్ శ్రీరామ్ కోటేశ్వరరావు గురువారం తెలిపారు. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ ఘనత సాధించిన ఏకైక గురుకులంగా ఇది నిలిచింది. మొత్తం 73 మంది విద్యార్థుల్లో 71 మంది ఫస్ట్ క్లాస్ సాధించగా, 40 మందికి 500కు పైగా మార్కులు వచ్చాయి. హర్షవర్ధన్ 573 మార్కులతో మొదటి స్థానం పొందారు.