మహిళలపై అవమానకర వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ తక్షణమే క్షమాపణ చెప్పాలని పూతలపట్టు వైసిపి ఇన్ఛార్జ్ సునీల్ కుమార్ గురువారం డిమాండ్ చేశారు. అనంతరం ఐరాల పోలీస్ స్టేషన్ లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు. మహిళలపై నీచంగా మాట్లాడితే ఉపేక్షించమని సునీల్ కుమార్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.