బంగారుపాళ్యం మండలంలోని సదకుప్పం గ్రామ సమీపంలో మామిడి తోటలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మందు స్ప్రే పనుల నిమిత్తం వెళ్లిన కూలీల మధ్య జరిగిన ఘర్షణలో కే. మనోజ్ (21) అనే యువకుడు తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవలే వివాహం చేసుకున్న మనోజ్ మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.