చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రాంబాబు దిష్టిబొమ్మను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ ఆధ్వర్యంలో దహనం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సంఘటన ఐరాల మండలం, అగరంపల్లి కూడలి వద్ద జరిగింది.