బంగారుపాళ్యం పోలీస్ స్టేషన్ పరిధిలో, మహిళను మోసం చేసి ఆమె అకౌంట్లోని డబ్బులు దొంగిలించిన రాజేష్ (27) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నూతిగుంట గ్రామానికి చెందిన రాజేష్‌ను అరగొండ రోడ్డు మారెమ్మ గుడి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. నిందితుడిని త్వరలో కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు.