పూతలపట్టు: చెరువులో పడి వ్యక్తి మృతి

పూతలపట్టు మండలం ఎగువ పాలకురు గ్రామానికి చెందిన రామకృష్ణయ్య చెరువులో పడి శనివారం మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు మండలంలోని దిగువ పాలకురు చెరువులో ఆవులు మేపడానికి వెళ్లి ఆవుల్ని అదుపు చేసే క్రమంలో చెరువులో దిగి ఈత రాకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. ఆవులు మేపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి మృతి చెందడంతో ఆ కుటుంబంతో పాటు గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్